బైబిల్ రిఫార్మ్డ్ బుక్స్

వివిధ భాషల్లో క్రైస్తవ పఠనం యొక్క శ్రేష్టమైన శ్రేణి

వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అపొ (కార్యములు 17:11)

బైబిల్ రిఫార్మ్డ్ బుక్స్

మా వెబ్‌ సైట్‌కు స్వాగతం!

ఈ వెబ్‌ సైట్ నెదర్లాండ్స్ సంస్కరించబడిన సమాజాల యొక్క వివిధ కమిటీల చొరవై యున్నది. ఈ వెబ్‌సైట్‌లోని పుస్తకాలు మరియు కరపత్రికలు (బ్రోచర్‌లు) దేవుని తప్పులేని వాక్యమైన బైబిల్‌పై స్థాపించబడ్డాయి మరియు అవి స్పష్టంగా సంస్కరించబడినవి మరియు కాల్వినిస్టిక్ (కాల్విన్ గారి సిద్ధాంతాలనుసారముగా ఉన్నవి ). అన్ని పుస్తకాలను ఇ-బుక్స్‌గా అందుబాటులో ఉంచారు మరియు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ వెబ్‌సైట్‌లో ఎనిమిది భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు జాన్ బన్యాన్ నుండి “యాత్రికుని ప్రయాణం” వంటి క్లాసిక్ రచనలను కనుగొనవచ్చు, కానీ మీ వ్యక్తిగత ధ్యాన సమయం కోసం లేదా మహిళల, పురుషుల లేదా యవ్వనుల గుంపు కోసం “బైబిల్ సూచికలు”  మరియు “బైబిల్ వ్యాఖ్యానాలను” కూడా కనుగొనవచ్చు.

క్షమాపణలు, నీతి మరియు పిడివాద విషయాలు వంటి వేదాంతశాస్త్రం గురించిన పుస్తకాలేగాక  సంఘం మరియు సంఘ చరిత్ర  పుస్తకాలు కూడా ఉన్నాయి. మీ స్వంత ఆధ్యాత్మిక జీవితం కోసం ఉపన్యాసాలు, ప్రార్థన గురించిన పుస్తకాలు, పరిశుద్ధాత్మ మరియు క్రైస్తవ కుటుంబ జీవితాన్ని ఎలా గడపాలి అనే పుస్తకాలు ఉన్నాయి.పాత మరియు క్రొత్త నిబంధన నుండి బైబిల్ కథలతో, పిల్లలకు చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి.

మరిన్ని భాషలలో మరిన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి మేము కృషి చేస్తాము.

(ఇ-పుస్తకాలను చదవడానికి మీరు అడోబ్ డిజిటల్ ఎడిషన్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించవచ్చు (ఉదాహరణకు). మీరు ఈ ప్రోగ్రామ్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.).

ఇ-బుక్ ను వెదకండి
Search e-book

వివిధ భాషలలో ఒక ఇ-బుక్ని కనుగొనడం ఈ వెబ్ సైట్లో చాలా సులభం
Finding an e-book
in the various languages
is very easy on this website.

ఇ-బుక్ డౌన్లోడ్
Download e-book

కావలసిన భాషలో ఇ-బుక్ ను డౌన్లోడ్ చేసుకోండి మరియు వెంటనే
చదవడం ప్రారంభించండి
Download the e-book in
the desired language
and start reading immediately.

చదవండి
Read

ఇ-బుక్స్ వివిధ భాషలలో
అందుబాటులో ఉన్నాయి
The e-books are
available in many
different languages.

మా (ఇ) పుస్తకాలు